ఆగస్టు నుంచి Foxconn Estates ఉత్పత్తులు

ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ఫాక్స్‌కాన్ ఆగస్టు నుంచి రాష్ట్రంలో ప్రొడక్షన్ ప్రారంభించనుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలాన్‌లో రూ.1200 కోట్లతో నెలకొల్పిన ప్లాంట్ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ సంస్థ ద్వారా తొలి ఏడాదిలో 25వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనుండగా, పదేళ్లలో దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దక్కుతుంది.

X
Open chat
1
Hello
How Can I Help You?